పక్కాగా ఎంఎస్‌ఎంఈల సర్వే
రాయచోటి: జిల్లాలో ఎంఎస్‌ఎంఈల సర్వేను పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో ఎంఎస్‌ఎంఈల సర్వే అంశంపై జిల్లా పరిశ్రమలశాఖ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసేందుకు పరిశ్రమల శాఖ అధికారులు, కమర్షియల్ టాక్స్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అనంతరం మండలాల వారీగా ప్రగతిని కలెక్టర్ సమీక్షించారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి కృష్ణారావు, జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారి లక్ష్మీపతి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.
భూ పరిహారం ప్రక్రియ వేగవంతం: జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించి నిర్వాసితులకు భూ పరిహారం పంపిణీ వేగంగా పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్‌కు వివరించారు. మంగళవారం విజయవాడ సచివాలయం నుంచి రాష్ట్రంలో జాతీయ రహదారుల భూసేకరణ, అటవీ భూముల కేటాయింపు, కోర్టు కేసుల అంశంలో జిల్లాల వారీగా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్సుకు కలెక్టర్ శ్రీధర్ ఛామకూరి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్‌లు పాల్గొన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల ప్రగతిని సీఎస్‌కు కలెక్టర్ వివరించారు.
కలెక్టర్ ఛామకూరి శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment