ప్రజల ప్రాణాలు పట్టవా!
రైల్వేకోడూరు అర్బన్: కడప–రేణిగుంట జాతీయ రహదారిపై అడుగడుగునా గుంతలున్నా.. మరమ్మతులు చేయకుండా కూటమి సర్కార్ ప్రజల ప్రాణాలను హరిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంక్రాతి లోపు రోడ్లు బాగు చేస్తామని డప్పు కొట్టి మరీ చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ .. ప్రతి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే, కూటమి నాయకులు 48 కోట్లు నిధులు మంజూరు అయినా పనులు చేయలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. ఇంతవరకు వేచి చూశామని వారంరోజులలో రహదారి సరి చేయకపోతే జాతీయ రహదారిపై ప్రజా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గతంలో ఎంపీ మిఽథున్‌రెడ్డి సహకారంతో 2200 కోట్లతో హైవే మంజూరు చేయించినా ఆ పనులూ చేసుకోలేక ఉన్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పేద ప్రజలకు చేసిందేమి లేదన్నారు.
నిధులున్నా రహదారి గుంతలు పూడ్చలేని స్థితిలో కూటమి నాయకులు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment