బాబు దావోస్ యాత్ర డ్రామా
నందలూరు: బాబు దావోస్ యాత్ర అంతా డ్రామా అని వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన అంతా భజన, ప్రచార ఆర్భాటాలకే పరిమితమని విమర్శించారు. 2014–19 మధ్యలో కూడా ఇలాగే దావోస్ వెళ్లారని, కానీ రాష్ట్రానికి తీసుకువచ్చిన పెట్టుబడులు శూన్యమని ఆయన గుర్తు చేశారు. మీడియాకు భారీగా డబ్బు ఇచ్చి హంగూ ఆర్భాటాలతో ప్రచారం చేసుకున్నంత మాత్రాన పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చే అవకాశం లేదన్నారు. కమీషన్ల కోసం వారిని వేధించకుండా అనుమతులు ఇస్తేనే ఏదైనా సాధ్యమన్నారు. ఈ మధ్యనే రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రూ. 3 లక్షల కోట్లు సాయం అందించామని చెప్పారని, కూటమి ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో లక్ష కోట్ల మేర అప్పు చేసిందని.. అలాంటప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సౌమిత్రి, జగదీశ్వర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, హరిబాబు, మణి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment