7న జెడ్పీ సర్వసభ్య సమావేశం
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఫిబ్రవరి 7వ తేది ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన జెడ్పీ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, జిల్లా అధికారులు ఆరోజు ఉదయం 10 గంటలకు కడపలోని జెడ్పీసమావేశ మందిరంలో జరిగే సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలని కోరారు.
సెమిస్టర్ ఫలితాల విడుదల
కడప ఎడ్యుకేషన్: వై.ఎస్.ఆర్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలోని 7,5 , 3 సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వీసీ ఆచార్య జి. విశ్వనాథకుమార్ బుధవారం విడుదల చేశా రు. ఈ సందర్భంగా ఆయన తక్కువ సమ యంలో ఫలితాల విడుదల కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ అదనపు పరీక్షల నియంత్రణాధికారి జి.ఫణీంద్ర రెడ్డి, సహాయ పరీక్షల నియంత్రణాధికారి ఉదయప్రకాష్‌రెడ్డి, నారపరెడ్డి, పీఆర్‌ఓ వి. శివకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
నేడు బాస్కెట్‌బాల్ ఎంపికలు
కడప ఎడ్యుకేషన్: జిల్లా మహిళ, పురుషుల అండర్ 23 ఇంటర్ డిస్ట్రిక్ జిల్లాస్థాయి బ్కాసెట్‌బాల్ ఎంపికలను 23వ తేదీ గురువారం కడపలోని జయనగర్‌కాలనీ జిల్లా పరిషత్తు బాలికల హైస్కూల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సదశివారెడ్డి తెలిపారు. ఈ పోటీలలో ప్రతిభచాటిని వారు ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విజయవాడలోని మేరిస్ స్టెల్లా కాలేజీలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు. క్రీడాకారులు 2002 జనవరి 1వ తేదీకి ముందు పుట్టినవారై ఉండాలని తెలిపారు.
ప్రతి చెల్లింపునకు
బిల్లు తప్పనిసరి
కలకడ: జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో ప్రతి చెల్లింపునకు బిల్లు తీసుకుని ఆడిట్ లో చూపాలని చిత్తూరు జిల్లా జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు ఆదేశించారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. గతంలో ఖర్చులు చేసినవాటికి బిల్లులు, ఖర్చులకు అవసరమైన మండల సర్వసభ్యసమావేశం తీర్మానం, జిల్లా పరిషత్ నుంచి విడుదలైన నిధులు కేటాయించిన పనులకే ఖర్చు చేశారా అనే అంశాలను పరిశీలించారు. జిల్లా, మండల పరిషత్ అనుమతి లేకుండా నిధులు ఖర్చు చేస్తే రికవరీ తప్పదని హెచ్చరించారు. ఉపాధిహామీ పథకం, పంచాయతీరాజ్ వ్యవస్థలో జవాబుదారీతనం ఉండాలని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అబ్దుల్‌రహీం, మండల విద్యాశాఖాధికారి మునీంద్రనాయక్, ఏపీఓ చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment