![తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06rjpt52-170006_mr-1738872215-0.jpg.webp?itok=rRLZESzx)
తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దు
విద్యార్థులకు ఎమ్మెల్యే ఆకేపాటి సూచన
రాజంపేట టౌన్: జన్మనిచ్చి కంటికి రెప్పలా చూసుకుంటూ, అల్లారు ముద్దుగా పెంచుకునే తల్లిదండ్రులకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని వారికి కడుపుకోత మిగల్చవద్దని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి సూచించారు. ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థిని అఖిల మృతదేహాన్ని వారి ప్రాంతమైన అనంతపురం జిల్లా సి.చిక్కేపల్లి పెద్దపప్పూరుకు తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే గురువారం అంబులెన్స్ ఏర్పాటు చేయించి మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆకేపాటి విలేకరులతో మాట్లాడారు.
పదిరోజుల వ్యవధిలో రాజంపేటలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడటం తనను ఎంతగానో కలచివేస్తోందన్నారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పారు. మృతురాలి కుటుంబ సభ్యుల బాధను చూస్తుంటే కడుపు తరుక్కు పోతోందని తెలిపారు. ఈ ప్రపంచంలో నిస్వార్థమైన ప్రేమను, ఆప్యాయతలను పంచేది ఒక్క తల్లిదండ్రులేనన్నారు. వారు రెక్కలు ముక్కలు చేసుకుని జీవించేది కన్నబిడ్డల కోసమేనని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment