కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ నియామకం
కడప అర్బన్: కడప కేంద్ర కారాగారం పర్యవేక్షణ అధికారిగా రాజేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన కడప కేంద్ర కారాగారం ఇన్‌చార్జి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పనిచేసిన ప్రకాష్‌ను నెల్లూరుకు బదిలీ చేసి అక్కడ పనిచేస్తున్న రాజేశ్వరరావుకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. అయితే ఆయనను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
యాంత్రీకరణ పరికరాలకు టెండర్ల ఆహ్వానం
రాయచోటి జగదాంబసెంటర్: అన్నమయ్య జిల్లాలో పట్టు రైతులకు సరఫరా చేసేందుకు అవసరమైన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు కొననుగోలు చేసేందుకు ఉత్పత్తిదారుల నుంచి సీల్డ్ టెండర్లు కోరుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా కొనుగోలు కమిటీ చైర్మన్ ఆదర్శ్ రాజేంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు అన్నమయ్య జిల్లా పట్టు పరిశ్రమల శాఖ అధికారి 9966153900 నంబర్‌లో కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలన్నారు. ఈ నెల 6 నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా టెండర్లు దాఖలు చేయవచ్చన్నారు.
ఇంటర్ ప్రాక్టికల్స్
పక్కాగా నిర్వహించాలి
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జనరల్ ప్రాక్టికల్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని ఇంటర్మీడియేట్ ఆర్జేడీ రవి పేర్కొన్నారు. గురువారం కడపలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సంబంధించి సైన్స్ జూనియర్ లెక్చరర్లకు పరీక్షల విధి విధానాలు, మార్కుల గురించి ఇంటర్ ఆర్‌ఐఓ బండి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ జిల్లాలో 14 పరీక్షా కేంద్రాల్లో ఒకేషనల్ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయన్నారు. పదోతేదీ నుంచి జనరల్ ప్రాక్టికల్స్ ప్రారంభమవుతాయన్నారు. జనరల్ ప్రాక్టికల్స్‌కు జిల్లాలో 78 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇంటర్ ఆర్‌ఐవో బండి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇంటర్‌బోర్డు ఆదేశానుసారం జరపాలని లెక్చరర్స్‌కు సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఆరోపణలకు తావు లేకుండా చూడాలన్నారు. జిల్లా స్పెషల్ ఆఫీసర్ మురళీ, డీసీ మెంబర్స్ ప్రాక్టికల్స్ గురించి సూచనలు, సలహాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సైన్స్ అద్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment