ఈ రాశి వారికి ఇంటాబయటా అనుకూలం.. గుడ్‌న్యూస్‌ వింటారు | Daily Horoscope Spet 06 2024 Telugu Rasi Phalalu Today | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి ఇంటాబయటా అనుకూలం.. గుడ్‌న్యూస్‌ వింటారు

Published Fri, Sep 6 2024 7:00 AM | Last Updated on Fri, Sep 6 2024 8:48 AM

Daily Horoscope Spet 06 2024 Telugu Rasi Phalalu Today

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.తదియ ఉ.11.57 వరకు తదుపరి చవితి, నక్షత్రం: హస్త ఉ.7.58 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: సా.4.50 నుండి 6.34 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.24 నుండి 1.12 వరకు, అమృత ఘడియలు: రా.3.22 నుండి 5.07వరకు.

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.09
రాహుకాలం : ఉ.10.30
నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం: పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

వృషభం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

మిథునం: రాబడి తగ్గుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగతాయి.

కర్కాటకం: పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాల పరిష్కారం. సన్నిహితుల నుంచి శుభవార్తలు. రాబడి సంతృప్తినిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం: ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కన్య: ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. «పరిచయాలు పెరుగుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. మీ సేవలకు గుర్తింపు రాగలదు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.

తుల: మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం: ఉద్యోగ ప్రయత్నాలలో కదలికలు. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక ప్రగతి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ధనుస్సు: యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం: కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. పనులు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కుంభం: బంధువులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

మీనం: రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement