ఈ రాశివారికి కొత్త వ్యక్తులతో పరిచయం, శుభవార్తలు వింటారు..! | Horoscope Today: Rasi Phalalu October 06 In Telugu | Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి కొత్త వ్యక్తులతో పరిచయం, శుభవార్తలు వింటారు..!

Published Sun, Oct 6 2024 8:54 AM | Last Updated on Sun, Oct 6 2024 9:00 AM

Horoscope Today: Rasi Phalalu October 06 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: శు.చవితి పూర్తి (24 గంటలు), నక్షత్రం: విశాఖ రా.10.04 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: రా.2.21 నుండి 4.01 వరకు, దుర్ముహూర్తం: సా.4.11 నుండి 4.59 వరకు, అమృతఘడియలు: ప.12.23 నుండి 2.11 వరకు.

సూర్యోదయం        :  5.54
సూర్యాస్తమయం    :  5.44
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం:  కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.

వృషభం: పరపతి పెరుగుతుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మిథునం: ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కర్కాటకం: సోదరులతో వివాదాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. ఆస్తులు కొంటారు. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

కన్య: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో జాప్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల: శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు అధిగమిస్తారు.

వ్చశ్చికం: సన్నిహితులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు.

ధనుస్సు: వ్యవహారాలలో పురోగతి. ఆస్తుల వివాదాలు పరిష్కారం. శుభకార్యాలపై చర్చలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

మకరం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. వస్తు, వస్త్రలాభాలు. పాతమిత్రుల కలయిక. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొంత ఊరట.

కుంభం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత.

మీనం: మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి కాస్త ఊరటనిస్తుంది. పనుల్లో జాప్యం. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దైవచింతన.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement