శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శర దృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.తదియ తె.4.43 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి చవితి, నక్షత్రం: స్వాతి రా.8.01 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: రా.2.06 నుండి 3.50 వరకు,దుర్ముహూర్తం: ఉ.5.43 నుండి 7.29 వరకు, అమృతఘడియలు: ఉ.10.12 నుండి 11.58 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.54, సూర్యాస్తమయం: 5.45.
మేషం: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. భూవివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం: ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. పనుల్లో మరింత పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.
మిథునం: వ్యూహాలలో పొరపాట్లు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులు విధుల్లో అవాంతరాలు.
కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.
సింహం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు.
కన్య: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఒప్పందాలలో ఆటంకాలు. పనులు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త చిక్కులు.
తుల: కృషి ఫలిస్తుంది. పనుల్లో విజయం. శుభవార్తా శ్రవణం. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
వృశ్చికం: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
ధనుస్సు: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. విద్యావకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
మకరం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం. బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు కోరుకున్న మార్పులు పొందుతారు.
కుంభం: దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
మీనం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
Comments
Please login to add a commentAdd a comment