నాలుగో రోజు ఏడు నామినేషన్లు | Sakshi
Sakshi News home page

నాలుగో రోజు ఏడు నామినేషన్లు

Published Tue, Apr 23 2024 8:35 AM

- - Sakshi

అద్దంకి: నామినేషన్ల పర్వం మొదలైన తరువాత నాలుగో రోజు ఏడు దాఖలయ్యాయి. ఇందులో ఒకటి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పానెం చిన హనిమిరెడ్డిది కాగా, రెండోది ఆయన భార్య పానెం ఆదిలక్ష్మి దాఖలు చేశారు. మిగిలిన ఐదింటిలో మందా శ్రీనివాసరావు, పాలపర్తి శ్రీనివాసులు ఇండిపెండెంట్లుగా వేశారు. జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ తరఫున బాచిన రాంబాబు, నవోదయం పార్టీ తరఫున గుంటుపల్లి గోపీ వేశారు.

యార్డుకు 95,448

బస్తాల మిర్చి రాక

కొరిటెపాడు(గుంటూరు):గుంటూరు మార్కెట్‌ యార్డుకు సోమవారం 95,448 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 93,891 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల సగటు ధర రూ.8,000 నుంచి రూ. 16,500 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల సగటు ధర రూ.8,000 నుంచి 20,000 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.11,000 వరకు ధర పలికింది.

Advertisement
Advertisement