సంక్షేమ ప్రభుత్వాన్ని సాధించుకుందాం | Sakshi
Sakshi News home page

సంక్షేమ ప్రభుత్వాన్ని సాధించుకుందాం

Published Wed, May 8 2024 9:05 AM

-

యద్దనపూడి: పేదల వైపు జగనన్న అండగా ఉంటే, పెత్తందారుల వైపు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, ఎల్లో మీడియా, బీజేపీ అండగా ఉన్నాయి.. అందుకే పెత్తందారులను సాగనంపి మరోమారు సంక్షేమ ప్రభుత్వాన్ని సాధించుకుందామని పర్చూరు వైఎస్సార్‌ సీపీ అసెంబ్లీ అభ్యర్థి యడం బాలాజీ పేర్కొన్నారు. మంగళవారం యద్దనపూడి మండలంలోని జాగర్లమూడి, యద్దనపూడి, గన్నవరం, వింజనంపాడు గ్రామాల్లో ఎమ్మెల్సీ తూమాటి మాధవ రావుతో కలిసి యడం బాలాజీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు మూడు పార్టీలతో పొత్తు పెట్టుకుని అలివి కాని హామీలతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి తమ్మా అమ్మిరెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పాలెపోగు రాంబాబు, ఎంపీపీ పులగం రజినీ, పార్టీ సీనియర్‌ నాయకులు దొడ్డా బ్రహ్మానందం, జంపాని కోటేశ్వరరావు, మువ్వల రాంబాబు, సన్నేబోయిన వెంకటప్పయ్య, రావూరి వేణుబాబు, నక్కా పోతిరెడ్డి, మానుగొండ శ్రీనివాసరెడ్డి, చిలుకూరు కృష్ణయ్య, ధూలిపాళ్ల వేణు, చెరుకూరి వేణు, తూబాటి బాలకృష్ణ, సర్పంచ్‌లు ఎమేలమ్మ, సుమలత, ఆయా గ్రామాల వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారంలో అసెంబ్లీ అభ్యర్థి

యడం బాలాజీ, ఎమ్మెల్సీ తూమాటి

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement