‘ సామాజిక ’ పోరు | - | Sakshi
Sakshi News home page

‘ సామాజిక ’ పోరు

Published Fri, Oct 18 2024 3:04 AM | Last Updated on Fri, Oct 18 2024 3:04 AM

‘ సామాజిక ’ పోరు

ఎంపీ అనుచరుడు తొలుత ఏర్పాటు చేసుకున్న దుకాణం పక్కనే ఎమ్మెల్యే సమీప బంధువు మద్యం దుకాణం పెట్టడం వివాదంగా మారింది. ఈ వ్యవహారం ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య మరింత ఆజ్యం పోసింది. రామ్మోహనరావు పేరుకు ఎంపీ మద్దతుదారుడుగా ఉన్నా ఆయన చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. యుధిష్టర్‌వర్మ .. ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ సామాజికవర్గానికి చెందడంతోపాటు ఆయనకు సమీప బంధువు కూడా . ఈ పరిస్థితిలో రామ్మోహన్‌రావు మద్యం దుకాణం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎమ్మెల్యే బంధువునన్న దర్పంతో యుధిష్టర్‌ వర్మ ఇలా షాపు ఏర్పాటు చేయడంపై నియోజకవర్గంలోని చంద్రబాబు సామాజికవర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది. మా ఓట్లతో ఎమ్మెల్యే అయిన వ్యక్తి మా సామాజికవర్గం వ్యక్తికి వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తారని మండిపడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement