కష్టపడే తత్వం అలవర్చుకోవాలి
జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ
బాపట్లటౌన్ /కారంచేడు: కష్టపడే తత్త్వాన్ని అలవర్చుకున్నప్పుడే లక్ష్యాలు సాధించగలమని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పోలీస్ సిబ్బందికి, వివిధ కళాశాలు, పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలగా నిలిచిన వారికి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నగదు బహుమతులు, ధ్రువపత్రాలను అందజేశారు. ఎస్పీ తుషార్‌డూడీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 21 నుంచి 31 వరకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి రూ.5 వేలు, ద్వితీయ బహుమతి రూ. 3వేలు, తృతీయ బహుమతి రూ.2 వేలు చొప్పున అందించామన్నారు.
పోలీస్ సిబ్బంది విభాగంలో విజేతలు వీరే..
బాపట్ల ఐటీ కోర్ విభాగంలో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఐ.కీర్తి ప్రథమ బహుమతి సాధించారు. వేమూరు పీఎస్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ గాస్పెల్ జ్యోతి ద్వితీయ బహుమతి, కారంచేడు పీఎస్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.నాగతులసి తృతీయ బహుమతి సాధించారు.
విద్యార్థి విభాగంలో..
వేమూరు మండలం పెరవలి గ్రామంలోని సీబీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థిని బండారు ధను శ్రీ ప్రథమ బహుమతి, చీరాల కొత్త పేటలోని బి.ఆర్.కె హైస్కూల్ విద్యార్థి ఎన్.లక్ష్మీసాయి రాహుల్ ద్వితీయ, మార్టూరులోని శ్రీ శ్రీనివాస హైస్కూల్ విద్యార్థిని పి.సాయి కీర్తి తృతీయ బహుమతి సాధించారు. వెల్ఫేర్ ఆర్.ఐ శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment