రాష్ట్రస్థాయి పోటీలకు కొప్పరపాడు విద్యార్థి ఎంపిక
బల్లికురవ: జిల్లాస్థాయి లో జరిగిన కౌశల్ 2024 క్విజ్‌పోటీ పరీక్షలో కొప్పరపాడు ఉన్నత పాఠశాల విద్యార్థి బత్తుల అభిరామ్, మొదటి ర్యాంకు సాధించినట్లు హెచ్‌ఎం పీ.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఈ నెల 6న ఆన్‌లైన్ ద్వారా జరిగిన ఈ పరీక్షకు పదో తరగతి విభాగంలో అభిరామ్ మొదటి ర్యాంకు సాధించినట్లు చెప్పారు. ఈ నెల 29, 30 తేదీలో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అభిరామ్ ఎంపికై నట్లు హెచ్‌ఎం తెలిపారు.
కుట్లు వేయడంపై వైద్య విద్యార్థులకు వర్క్‌షాప్
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో పీజీ వైద్య విద్యార్థులకు, జూనియర్ వైద్యులకు ఆపరేషన్ల అనంతరం కుట్లు వేసే విధానంపై (సూచరింగ్ టెక్నిక్స్) వర్క్‌షాప్ నిర్వహించారు. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ యతికాన్ సూచరింగ్ టెక్నిక్స్ పేరుతో నిర్వహించిన వర్క్ షాప్‌ను వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీజీ వైద్య విద్యార్థులకు పొట్టకు, కాలికి, చేతికి, ముఖంపై కుట్లు వేసే సమయంలో తీసుకోవాల్సిన టెక్నిక్స్‌పై వర్క్‌షాప్ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. వైద్య విద్యార్థులు నేర్చుకునేందుకు ఏసీ బస్సులో పది వర్కింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారని, నాలుగు రోజులపాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్క్‌షాప్ జరుగుతుందని చెప్పారు. నాలెడ్జ్ ఆన్ వీల్ నినాదంతో బస్సులో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ల్యాప్రోస్కోపిక్ సర్జరీ సమయంలో ఏవిధంగా కుట్లు వేయాలనే విషయాలను వైద్య విద్యార్థులకు వివరిస్తారని చెప్పారు. పీజీ వైద్యులతోపాటు, జూనియర్ వైద్యులు కూడా సూచరింగ్ టెక్నిక్స్ నేర్చుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment