పోలీస్ బందోబస్తు మధ్య సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకార
ఐలవరం(భట్టిప్రోలు): భట్టిప్రోలు మండలం ఐలవరం దళితవాడలో సోమవారం పోలీస్ బందోబస్తు, మండల అధికార యంత్రాంగం సమక్షంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక దళితవాడలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పక్కనే ఉన్న కమ్యూనిటీ స్థలంలో కొంత మంది వ్యక్తుల కోసం రహదారి ఏర్పాటు చేయడంపై 2016 నుంచి స్థానిక సంఘం ఆక్షేపణ వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఆ స్థలంలో రహదారి నిర్మాణానికి 2021లో తీర్మానం చేసింది. దీనిపై సంబంధిత వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు సోమవారం మండల యంత్రాంగం, పోలీస్ అధికారులు ఐలవరం విచ్చేసి రహదారి నిర్మాణానికి జరుగుతున్న కీ వాల్ పనులను చేయించారు. తహసీల్దార్ మేకా శ్రీనివాసరావు, ఎంపీడీవో ఎస్ వెంకటరమణ, వేమూరు సీఐ పి.వీరాంజనేయులు, కొల్లూరు, వేమూరు, భట్టిప్రోలు ఎస్‌ఐలు ఏడుకొండలు, రవికృష్ణ, ఎం.శివయ్య, పంచాయతీరాజ్ ఏఈ శేతు రామచంద్రరరావు, కార్యదర్శి ఎం.కోటేశ్వరరావు, వీఆర్వో లక్ష్మి, వివిధ శాఖల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కమ్యూనిటీ స్థలంలో అందరికి అనుకూలంగా ఉండే భవనం కానీ, పిల్లల ఆటలాడుకునేందుకు ప్లే గ్రౌండ్ కానీ వేయకుండా రోడ్డు వేయడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు రహదారి నిర్మాణం పనులు చేయించేందుకు విచ్చేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment