అర్జీలు పునరావృతం కాకుండా చూడండి
ఎస్పీ తుషార్ డూడీ
బాపట్ల: అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన అర్జీదారుల సమస్యలను ఎస్పీ స్వయంగా విని, వారు ఇచ్చిన అర్జీలను పరిశీలించారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. సమస్యలను చట్ట పరిధిలో విచారించి పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా పూర్తిస్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలని ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. మొత్తం 37 మంది అర్జీలను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్, పి.జి.ఆర్.ఎస్ ఇన్‌చార్జి సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment