30 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
నగరంపాలెం: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశించారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఈ పరీక్షలు గుంటూరు పోలీస్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా ఎస్పీ ఏర్పాట్లు పరిశీలించారు. 1600 మీటర్లు, 100 మీటర్లు పరుగుపందెం, లాంగ్ జంప్ వంటి పరీక్షల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు. అభ్యర్థులు మైదానంలోకి ప్రవేశించిన దగ్గర్నుంచి దేహదారుఢ్య పరీక్షలు ముగిసే వరకు ఎటువంటి ఇబ్బందు లు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ధ్రువపత్రాల పరిశీలన, ఛాతీ, ఎత్తు, కొలతలు పర్యవేక్షించే సిబ్బంది సమర్థంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), కె.సుప్రజ (క్రైం), ఏఓ ఎ.వెంకటేశ్వరరావు, డీఎస్పీలు బి.సీతారామయ్య (ఎస్‌బీ), అజీజ్ (తూర్పు) పోలీస్ అధికార, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment