అర్జీల పరిష్కారంలో బాపట్ల జిల్లా భేష్‌ | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంలో బాపట్ల జిల్లా భేష్‌

Published Wed, Jan 1 2025 2:13 AM | Last Updated on Wed, Jan 1 2025 2:13 AM

-

బాపట్ల: రెవెన్యూ సదస్సులు, రీ సర్వేలలో నమోదయ్యే అర్జీల పరిష్కారంలో బాపట్ల జిల్లా భేష్‌ అని సీసీఎల్‌ఏ డిప్యూటీ కమిషనర్‌ జయలక్ష్మి ప్రశంసించారు. రెవెన్యూ సదస్సులు, భూముల రీ సర్వేపై సీసీఎల్‌ నుంచి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళి హాజరయ్యారు. బాపట్ల జిల్లాలో రెవెన్యూ సదస్సులు, రీ సర్వేలలో బాపట్ల జిల్లా అధికారులు బాగా పనిచేస్తున్నారని కితాబు నిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 4,961 అర్జీలు నమోదు కాగా 98శాతం పరిష్కరించడంపై జిల్లా కలెక్టర్‌, జిల్లా సంయుక్త కలెక్టర్‌లను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. సదస్సులు ముగిసే వరకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆమె సూచించారు. రెవెన్యూ సదస్సులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న భూముల సమస్యలను పరిష్కరించడమే రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమన్నారు. భూ సమస్యల పరిష్కారంలో ప్రజల సంతృప్తిస్థాయి మరింత మెరుగ్గా ఉండేలా తహసీల్దార్లు పని చేయాలన్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి భూములను తొలగించిన సంబంధిత దస్త్రాలను పునఃపరిశీలించాలన్నారు. జనవరి మొదటి వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. సరిహద్దు రాళ్లపై బొమ్మలను తొలగించే ప్రక్రియ బాపట్ల జిల్లాలో 64శాతం పూర్తి చేయడం అభినందనీయమని రీ సర్వే అదనపు ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎన్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బాపట్ల జిల్లాలో శరవేగంగా ఈ ప్రక్రియ జరగడం అభినందనీమన్నా రు. ఇదే మాదిరిగా అన్ని జిల్లాల్లోనూ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. రీ సర్వేపై క్షేత్రస్థాయిలో పనిచేసే రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక శిక్షణలు ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. బాపట్ల జిల్లాలో నాణ్యత ప్రమాణాలతో పరిష్కార ప్రక్రియ జరుగుతుందని అభినందించారు. జిల్లా నుంచి జేసీ ప్రఖర్‌ జైన్‌, డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సీసీఎల్‌ఏ డెప్యూటీ కమిషనర్‌ జయలక్ష్మి

కలెక్టర్‌, జేసీలకు అభినందనలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement