న్యాయవాద వృత్తి మహోన్నతం
విశ్రాంత జిల్లా న్యాయమూర్తి శ్యామ్‌సుందర్ జయరాజు
చీరాల రూరల్: న్యాయవాద వృత్తి మహోన్నతమైనదని విశ్రాంత జిల్లా న్యాయమూర్తి ఎస్. శ్యామ్‌సుందర్ జయరాజు అన్నారు. నూతన సంవత్సర వేడుకలను గురువారం ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐఎల్‌ఏ) చీరాల ఆధ్వర్యంలో స్థానిక థామస్‌పేటలోని విశ్రాంత జిల్లా న్యాయమూర్తి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు డైరీలు, క్యాలెండర్లు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతర విద్యార్థులు కావాలని సూచించారు. ఉన్నత న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు కొత్తకొత్త తీర్పులు వెలువరిస్తుంటాయని వాటన్నింటిని కూలంకషంగా చదవాలని చెప్పారు. వృత్తిని అంకితభావం, నిజాయతీతో నిర్వర్తించి కక్షిదారులకు న్యాయ సహాయం అందిస్తే మనల్ని ఎంతో ఆప్యాయతతో గౌరవిస్తారని చెప్పారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ రమేష్‌బాబు, ఐఎల్‌ఏ పట్టణ అధ్యక్ష , కార్యదర్శులు మంకెన అశోక్‌కుమార్, కొప్పుల వాసుబాబు, గౌరవాధ్యక్షుడు కర్నేటి రవి, న్యాయవాదులు మిక్కిలి పుల్లయ్య, బొనిగల జైసన్‌బాబు, ఐనంపూడి పవన్‌కుమార్, గోదావరి సురేష్, షేక్ సిరాజ్, కుమార్, సుదర్శనం కరుణకుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment