నాలుగేళ్లుగా భోజనం చేయడానికీ అవస్థలే
గుంటూరు మెడికల్: నాలుగు సంవత్సరాలుగా అన్నం మింగుడుపడక, మంచినీరు తాగేందుకు కూడా అవస్థలు పడుతూ తీవ్ర అనారోగ్యానికి గురైన మహిళకు గుంటూరు జీజీహెచ్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి వ్యాధి నుంచి విముక్తి కల్పించారు. శనివారం గుంటూరు జీజీహెచ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అందె కోటి వెంకటేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. మచిలీపట్నానికి చెందిన వెంకట మహాలక్ష్మి నాలుగేళ్లుగా ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా వ్యాధి నయం కాలేదు. గత ఏడాది డిసెంబరులో జీజీహెచ్‌కు రాగా, వైద్య పరిభాషలో ఎక్సాషియా కార్డియా సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. డిసెంబరు 24న సుమారు 3 గంటల సేపు విజయవంతంగా ఆపరేషన్ చేశామన్నారు. ఎనస్థీషియా వైద్య విభాగాధిపతి డాక్టర్ పోలయ్య సహకరించారన్నారు. రోగిన డిశ్చార్జి చేసినట్లు వెల్లడించారు. సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ మాట్లాడుతూ ఎండోస్కోపిక్ ద్వారా కోత, కుట్లు లేకుండా అత్యాధునిక వైద్య పరికరాలతో ఆపరేషన్ చేశారన్నారు. వైద్యులను అభినందించారు.
ఆపరేషన్‌తో మహిళకు ఉపశమనం కల్పించిన జీజీహెచ్ వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment