సర్వేలను నూరు శాతం పూర్తి చేయాలి
తాడికొండ: ప్రభుత్వం సూచించిన ఆరు రకాల సర్వేలను వేగవంతంగా నూరు శాతం పూర్తిచేయాలని జెడ్పీ డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ అన్నారు. తాడికొండ, తుళ్లూరు మండల పరిషత్ కార్యాలయాల్లో కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కొనసాగుతున్న మిక్సింగ్ ఆధార్, హౌస్ హోల్డ్ సర్వే, ఎంఎస్‌ఎంఈ సర్వే, గ్రామ పంచాయతీ పరిధిలోని కమ్యూనిటీ స్థలాల ఆన్‌లైన్ సర్వే, సీఏసీఎస్‌లో రుణాలు తీసుకున్న వారి నిర్ధారణ సర్వే నూరుశాతం పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణ పథకం కింద పనులు ప్రారంభించి నిలిపివేసిన వాటిని వెంటనే పూర్తి చేయించేలా చూడాలన్నారు. తాడికొండ, తుళ్లూరు మండలాల ఎంపీడీవోలు కె సమతావాణి, కానూరి శిల్ప, పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment