ప్రభుత్వ డిగ్రీ కళాశాల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ ఎ
రేపల్లె రూరల్: ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ బాపట్ల జిల్లా యూనిట్ నూతన కమిటీ ఎన్నికలు పట్టణంలో ప్రభుత్వ ఏబీఆర్ డిగ్రీ కళాశాలలో సోమవారం జరిగాయి. గుంటూరు మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకుడు పి.సుధాకర్‌రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ఎన్నికలలో అసోసియేషన్ అధ్యక్షుడిగా రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్ధశాస్త్రం అధ్యాపకుడు డాక్టర్ కె.భాస్కరరావు ఎన్నికయ్యారు. సెక్రటరీగా అద్దంకి కళాశాల ఫిజిక్స్ అధ్యాపకుడు డాక్టర్ వి.ప్రసాద్, ట్రెజరర్‌గా చీరాల ప్రభుత్వ మహిళా కళాశాల జువాలజీ అధ్యాపకురాలు ఎన్.అంకమ్మ, ఉపాధ్యక్షుడిగా బాపట్ల కామర్స్ అధ్యాపకుడు షేక్.అబ్దుల్‌కలాంలు ఎన్నికయ్యారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ సభ్యులకు ఆయా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment