వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి
బాపట్ల: బాపట్ల మండలం మూలపాలెంకు చెందిన డక్కుమళ్ళ బోడెమ్మపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారని రూరల్ పోలీసు స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రలేచి కాలకృత్యాల కోసం బయటకురాగా ఒక వ్యక్తి వెనుక నుంచి గొంతుపట్టుకుని చంపేందుకు ప్రయత్నించాడని బోడెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే సమయానికి తన భర్త, ఇరుగుపొరుగువారు రావటంతో అగంతకుడు పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
రేపల్లె రూరల్: అనారోగ్య బాధలు తాళలేక ఓ వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందినట్లు పట్టణ ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు. ఇసుకపల్లికి చెందిన నంద్యాల రాజేంద్ర (40) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో సోమవారం ఉదయం ఇంట్లోని ఫ్యాన్ హుక్కుకు ఉరివేసుకున్నాడు. గమనించిన మృతుని భార్య శివనాగ విజయలక్ష్మి స్థానికుల సహాయంతో రాజేంద్రను కిందకు దింపి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు. అనారోగ్యరీత్యా ఉరిపెట్టుకున్నట్లు మృతుని భార్య శివ నాగ విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రామాపురంలో మరో వ్యక్తి..
చీరాల: ఇంట్లో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటనపై సోమవారం మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఈపూరుపాలెం రూరల్ ఎస్‌ఐ చంద్రశేఖర్ సోమవారం తెలిపారు. రూరల్ ఎస్‌ఐ వివరాల మేరకు.. రామాపురం గ్రామంలో సీఈసీ కాలేజీ వెనుక వైపు గల ఎస్టీ కాలనీకి చెందిన కోడూరు వెంకట్రావు (34) ఇంట్లో దూలానికి దుప్పటితో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతురాలి భార్య ఇంటి పక్కన ఉన్న పొలంలో పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఉరి వేసుకుని మృతి చెందాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు అందజేత
బాపట్ల: పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మున్సిపల్ కమిషనర్ జి.రఘునాథరెడ్డి సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు కొబ్బరినూనె, సబ్బులను సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పంపిణీ చేశారు. మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ కరుణ, డి.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment