తొలి ఖోఖో ప్రపంచకప్ పోస్టర్ ఆవిష్కరణ
జే.పంగులూరు: ఢిల్లీలో అట్టహాసంగా మొట్టమొదటి సారిగా ఖోఖో ప్రపంచ కప్ పోటీలు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర ఖోఖో కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మయ జూనియర్ కళాశాలలో ఎస్‌ఆర్‌ఆర్ ఖోఖో అకాడమీ వారి ఆధ్వర్యంలో తొలి ఖోఖో ప్రపంచ కప్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఖోఖో అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ బాచిన చెంచు గరటయ్య మాట్లాడుతూ.. గ్రామస్తుల సహకారంతో ఇప్పటికి పంగులూరులో ఎన్నోసార్లు రాష్ట్ర, జాతీయ స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రపంచకప్ పోటీలు ఢిల్లీలో జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నట్లు తెలిపారు. 2008లో నిర్వహించిన సీనియర్ నేషనల్ ఖోఖో పోటీలు గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చాయన్నారు. అర్జున అవార్డు గ్రహీత రవణారావు ఖోఖో పోటీల నిర్వహాణ చూసి ఇది పంగులూరా లేక బెంగళూరా ..! అని అన్నారని గుర్తు చేశారు. ఖోఖో పోటీల వలన గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువకులకు ఎంతో ఉపయోగం అన్నారు. అనంతరం సీతారామిరెడ్డి మాట్లాడుతూ వారం రోజుల పాటు జరిగే ఖోఖో ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో 21 దేశాల నుంచి పురుషుల జట్లు, 20 దేశాల నుంచి మహిళా జట్లు పోటీపడుతున్నాయన్నారు. మొత్తం 24 దేశాలు టోర్నమెంట్ కోసం భారత్‌కు వస్తున్నాయన్నారు. అనంతరం గ్రామంలో పంగులూరు హైస్కూల్ విద్యార్థులచే ఖోఖో ప్రపంచ్ కప్ ర్యాలీ నిర్వహించారు. చెంచు గరటయ్య పోస్టర్ ఆవిష్కరించారు. పంగులూరు జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం రమాదేవి, గ్రామ పెద్దలు వీరనారాయణ, శ్రీనివాసరెడ్డి, శ్రీను, సుబ్బారావు, వీరరాఘవయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment