బాధితులకు న్యాయం జరిగేలా చూడండి
● జిల్లా ఏఎస్పీ టి.పి.విఠలేశ్వర్ ● ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 37 అర్జీలు
బాపట్ల: బాధితులకు సరైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారవేదికలో 37అర్జీలు రాగా వాటిని సంబంధిత పోలీసు అధికారులకు పంపారు. బాధితులు ఇచ్చిన అర్జీలపై సంబంధిత పోలీసు అధికారులు ప్రత్యేక శ్రద్ధతీసుకుని పరిష్కారించాలని సూచించారు. అర్జీదారులకు భరోసా కల్పించేవిధంగా వ్యవహారించాలని కోరారు. ఫిర్యాదులపై వెంటనే చట్టపరిధిలో విచారణ జరిపి నిర్దిష్ట గడువులోపు పరిష్కరించాలని సూచించారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఇతర సమస్యలపై వచ్చిన వినతులను పరిశీలించి, సమస్యలు ఆలకించారు. పి.జి.ఆర్.ఎస్ సెల్ ఎస్‌ఐ శ్రీనివాసరావు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment