శుచిగా, రుచిగా భోజనం అందించాలి
బల్లికురవ: ప్రభుత్వం డ్రాప్ అవుట్ అవకుండా విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గురుకుల బాలికల విద్యాలయాల్లో శుచిగా రుచిగా నాణ్యమైన భోజనం అందించాలని బాపట్ల డీఈవో పురుషొత్తం కోరారు. శనివారం సాయంత్రం బల్లికురవలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలో 6 నుంచి ఇంటర్మీడియేట్ వరకు 244 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. డీఈవో తరగతుల వారీగా బాలికలను పలు ప్రశ్నలు వేసి సమాధానం రావడంతో సంతృప్తి చెందారు. పరీక్షల సమయం ఆసన్నమవుతున్నందున రెండు నెలలపాటు కష్టపడటంతోపాటు ఇష్టపడి చదువుతూ మంచి ఫలితాలు సాధించాలన్నారు. పదోతరగతి, ఇంటర్ ఫలితాలు జీవితానికి తొలిమెట్టు అని ఆయన చెప్పారు. విద్యలో వెనుకబడిన బాలికలను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయునిలను ఆదేశించారు. అనంతరం డీఈవో సిబ్బందితో కలిసి సమావేశం నిర్వహించారు. సమావేశంలో 100 శాతం ఫలితాలు సాధించాలని ఆయన ఆదేశించారు. తనిఖీలో ఎంఈవో 2 రమేష్‌బాబు, విద్యాలయ ప్రిన్సిపాల్ కె. సరళకుమారి పాల్గొన్నారు.
బాపట్ల డీఈవో పురుషొత్తం
Comments
Please login to add a commentAdd a comment