తక్కువ ధరతో వేగంగా ఇళ్లకే వస్తువుల డెలివరీ
నరసరావుపేట: ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ నిర్వహిస్తున్న కార్గో సర్వీసులో నూతనంగా చేపట్టన డోర్ డెలివరీ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ జిల్లా అధికారి ఎన్.శ్రీనివాసరావు కోరారు. డోర్ డెలివరీ సౌకర్యానికి తగిన ప్రచారం కల్పించే ఉద్దేశంతో ప్రతి ఉద్యోగి మూడు పార్శిళ్లను పంపించాలనే సంస్థ ఆదేశాలను అనుసరించి శనివారం డిపోలోని జిల్లా కార్యాలయంలో వాటిని పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో సర్వీసు విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రైవేటు కొరియర్ సర్వీసుల కంటే తక్కువ ధరకే చాలా వేగంగా ప్రజలకు వస్తువులు, సరుకులు, లెటర్లు, ప్యాకెట్లు, మందులు, ఆయిల్స్, నిత్యావసరాలు డెలివరీ చేస్తున్నామని తెలిపారు. డోర్ డెలివరీ సౌకర్యాన్ని గత నెల 20వ తేదీ నుంచి ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు, పల్నాడు జిల్లాల కమర్షియల్ అధికారి డి.ఆదినారాయణ, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment