నదిలోకి దూకిన యువకుడు
తాడేపల్లిరూరల్: ప్రకాశం బ్యారేజ్ రైలింగ్ నుంచి కృష్ణా నదిలోకి ఓ యువకుడు శనివారం దూకాడు. ఆత్మహత్య చేసుకున్నాడని భావించి కాపాడేందుకు వచ్చిన పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి పారిపోయాడు. వివరాలు.. కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ 14వ ఖానా వద్ద దిగువ ప్రాంతంలో యువకుడు నీటిలోకి దూకాడు. అది గమనించిన ప్రజలు తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువకుడు పైకి తేలకుండా నీటిలోనే ప్రకాశం బ్యారేజ్ కిందకు వెళ్లడంతో పైనున్న వారికి అతడు కనిపించలేదు. ఆత్మహత్య చేసుకున్నాడని భావించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా సదరు యువకుడు నీటిలో తేలియాడుతూ కనిపించాడు. సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి దూకడంతో నీటి అడుగున ఉన్న కాంక్రీట్ ఫ్లోరింగ్ తగిలి మృతి చెంది ఉంటాడని భావించారు. 20 నిమిషాల అనంతరం ఆ యువకుడు ఈత కొట్టడంతో పోలీసులు పైకి రావాలని సూచించారు. పోలీసులను చూసి కంగారు పడిన అతడు దిగువ యాప్రాన్ నుంచి కృష్ణానది గేట్లు ఎక్కాడు. మళ్లీ ఎగువ ప్రాంతంలో ఈదుకుంటూ కిందికి దిగి ప్రకాశం బ్యారేజ్ గేట్లకు కిందభాగంలో ఉన్న సొరంగ మార్గం ద్వారా విజయవాడ వైపు వెళ్లిపోయాడు.
కాపాడటానికి వెళ్లిన పోలీసులు ముప్పతిప్పలు పెట్టి పరారీ
Comments
Please login to add a commentAdd a comment