అవయవాలు, నేత్ర దానంతో సజీవం
బొల్లవరం(ముప్పాళ్ల): శరీరం, నేత్ర దానంతో ఆదర్శంగా నిలిచిందో మాతృమూర్తి. మండలంలోని బొల్లవరం గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకురాలు, ప్రజాతంత్ర మహిళా సంఘంలో చురుకుగా పనిచేసిన కళ్లం మునెమ్మ(88) శనివారం మృతి చెందారు. ఆమె భర్త సత్యనారాయణరెడ్డి కూడా పార్టీలో పనిచేశారు. చనిపోయిన తర్వాత మునెమ్మ కోరిక మేరకు ఉదయాన్నే శంకర కంటి ఆసుపత్రి వైద్యులు కళ్లను సేకరించారు. అనంతరం భౌతికకాయాన్ని విజయవాడలోని నిమ్రా వైద్య కళాశాల వైద్యులు స్వాధీనం చేసుకొని అంబులెన్స్‌లో తీసుకెళ్లారు.తొలుత సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్‌కుమార్ తదితరులు మునెమ్మ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ఆదర్శంగా నిలిచిన మునెమ్మ
Comments
Please login to add a commentAdd a comment