పాల ట్యాంకర్‌ను ఢీకొని యువకుడి దుర్మరణం
సంతమాగులూరు (అద్దంకి రూరల్): ముందు వెళ్తున్న పాల ట్యాంకర్‌ను వెనుక నుంచి స్కూటీ ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈఘటన గురువారం సంతమాగులూరు మండలం పాతమాగులూరు వద్ద చోటుచేసుకుంది. ఎస్‌ఐ పట్టాభిరామయ్య వివరాల మేరకు.. నరసరావుపేటకు చెందిన రంగా శివ (30) స్కూటీ మీద సంతమాగులూరు నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను గమనించక ఢీకొట్టాడు. స్కూటీ లారీ వెనుక వైపు దూసుకుపోవటంతో శివ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.
‘తానా’ నవలల పోటీకి రచనల ఆహ్వానం
తెనాలి: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రెండేళ్లకోసారి నిర్వహించే నవలల పోటీని ఈ ఏడాది రూ.2 లక్షల బహుమతితో నిర్వహిస్తోంది. 1997 నుంచి జరుపుతున్న ఈ పోటీలను మధ్యలో కొంత విరామంతో 2017 నుంచి కొనసాగిస్తోంది. ఈ పోటీల్లో బహుమతులు గెలిచిన, శప్తభూమి, నీల, ఒంటరి, కొండపొలం, మున్నీటి గీతలు, అర్థనారి నవలలు పలు అవార్డులను గెలిచాయి. కొండపొలం సినిమాగా రాగా, మున్నీటి గీతలు వెబ్‌సిరీస్‌గా వస్తోంది. రాబోయే జులై 3,4,5 తేదీల్లో డెట్రాయిట్‌లో జరగనున్న తానా మహాసభల సందర్భంగా మళ్లీ నవలల పోటీలు జరుపుతున్నట్టు తానా కార్యక్రమ నిర్వాహకులు జంపాల చౌదరి, ప్రచురణల కమిటీ అధ్యక్షుడు చంద్ర కన్నెగంటి గురువారం ప్రకటించారు. రచయితలు తమ రచనలను ఏప్రిల్ 15వ లోగా అక్షర క్రియేటర్స్, ఏజి–2, ఎ–బ్లాక్, మాతృశ్రీ అపార్ట్‌మెంట్స్, హైదర్‌గూడ, హైదరాబాద్–500029 చిరునామాకు పంపాలని వివరించారు. ఇతర వివరాలకు 9849310560, 9949656668 నంబర్లను సంప్రదించాలని కోరారు.
భూములిచ్చిన రైతులకు శుభవార్త
తాడేపల్లి రూరల్ : ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కింద రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు సీఆర్‌డీఏ అధికారులు రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చేందుకు గురువారం సన్నాహాలు చేపట్టారు. దానిలో భాగంగా ఆయా గ్రామాల్లోని సీఆర్‌డీఏ కార్యాలయంలో వివరాలు అందుబాటులో ఉంచారు. అభ్య ంతరాలు ఉంటే తెలియజేయాలని డిప్యూటీ కలెక్టర్ చిన్నికృష్ణ తెలిపారు. జనవరి నెలాఖరు వరకు ఉదయం 10 – సాయంత్రం 5 గంటల మధ్య అభ్యంతరాలు చెప్పొచ్చని పేర్కొన్నారు. యూనిట్ సర్వేయర్ కె.అశోక్ – 97002 26636, గ్రామ సర్వేయర్లు అంకారావు 81791 34934, బి. మెహబూబ్ 86887 35648 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment