చిలకమ్మవారిపాలెంలో వ్యక్తి దారుణ హత్య
● వివాహేతర సంబంధమే కారణం ? ● కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నగరం: వివాహేతర సంబంధం కారణంగా వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం రాత్రి మండలంలోని చినమట్టపూడి పంచాయతీ పరిధిలోని చిలకమ్మవారిపాలెంలో జరిగింది. ఎస్‌ఐ బి. భార్గవ్ సమాచారం మేరకు గ్రామానికి చెందిన లుక్కా నాగరాజు(42) ఓ దుకాణం నుంచి సరుకులు తీసుకుని ద్విచక్ర వాహనంపై పెట్టుకుంటున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దీంతో నాగరాజు అక్కడిక్కడే మృతి చెందాడు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నాగరాజు మృతదేహనికి పోలీసులు శవపంచనామా చేసి రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నాగరాజుకు భార్య, కుమారుడు,కుమార్తె ఉన్నారు. మృతుని భార్య శిరీష తన భర్తను గ్రామానికి చెందిన సాంబయ్య చంపి ఉంటాడనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్‌ఐ భార్గవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నాగరాజు గ్రామంలో బడ్డికొట్టు నిర్వహిస్తున్నాడు. సరుకుల కోసం గ్రామంలోని సాంబయ్య దుకాణానికి వెళ్లాడు. అక్కడ సరుకులు తీసుకుని వెళ్లుతున్న సమయంలో సాంబయ్య కత్తితో నాగరాజును హత్య చేశాడనే వాదనలు విన్పిస్తున్నాయి. సాంబయ్య భార్యకు నాగరాజుకు వివాహేతర సంబంధం ఉందని, అందుకే హత్య జరిగిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పోలీసుల విచారణలో అసలు నిజం తేలనున్నది.
Comments
Please login to add a commentAdd a comment