స్వర్ణోత్సవాలను జయప్రదం చేయాలి
యూటీఎఫ్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు వినయ్
నిజాంపట్నం: కాకినాడలో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే స్వర్ణోత్సవ మహాసభల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని యూటీయఫ్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు జె.వినయ్ కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ సీహెచ్. బాపయ్య పిలుపునిచ్చారు. స్వర్ణోత్సవ సభల ప్రచార జాతాలో భాగంగా మండలంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత అమరజీవి చెన్నుపాటి లక్ష్మయ్య ఆశయ సాధన లక్ష్యంగా ఏర్పడిన యూటీఎఫ్ విద్యారంగ వికాసం, ఉపాధ్యాయ సంక్షేమం తద్వారా సమాజాభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. తొలుత స్వర్ణోత్సవ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ మండల అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎండీ హుస్సేన్, గౌరవాధ్యక్షుడు సీహెచ్. గణేష్‌రావు, జిల్లా కౌన్సిలర్లు డి.హరిబాబు, అబుల్ మాలిక్, కొండలరావు, సుభానీ ఖాన్, మహేశ్వరరావు, చెన్ను సందీప్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment