8వ తేదీ నుంచి అంతర్‌రాష్ట్ర క్రికెట్ పోటీలు
మేదరమెట్ల: కొరిశపాడు మండలం రావినూతల గ్రామంలోని రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 31వ అంతర్ రాష్ట్ర క్రికెట్ పోటీలు ఈనెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ సభ్యులు మంగళవారం తెలిపారు. నిర్వాహకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గతంలో మాదిరిగానే ఈపోటీలు 20–20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు. పోటీల్లో గెలుపొందిన మొదటి జట్టుకు రూ.3 లక్షలు, రెండో జట్టుకు రూ.2 లక్షలు, మూడో జట్టుకు రూ.లక్ష నగదు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. బెస్ట్ బ్యాటర్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్‌లకు కూడా బహుమతులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని, పోటీలు నాకౌట్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. పోటీలను భ్రమర సంక్రాంతి కప్ పేరుతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కారుసాల నాగేశ్వరరావు (బాబు), కార్యదర్శి మోపర్తి శేషారావు, రామినేని శ్రీనివాసరావు, కారుసాల సుబ్బారావు, మోపర్తి లక్ష్మీనారాయణ, చేబ్రోలు నాగేశ్వరరావు, యడ్లపల్లి నరసింహారావు, కారుసాల బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.
మొదటి బహుమతి రూ.3 లక్షలు పాల్గొననున్న వివిధ రాష్ట్రాల జట్లు
Comments
Please login to add a commentAdd a comment