రేపల్లె, వేమూరు నియోజకవర్గాలను టీడీపీ నాయకులు జూదాల నిర్వహణకు కేంద్రంగా ఎంచుకున్నారు. వేమూరు నియోజకవర్గంలోని చుండూరు, వేమూరు, భట్టిప్రోలు మండలాల్లో కోడి పందేల నిర్వహణకు అధిక విస్తీర్ణంలో బరులను సిద్ధం చేశారు. కొల్లూరు మండలంలో అనంతవరం, కొల్లూరు శివారు బోసు నగర్ ప్రాంతాల్లో రెండు బరులను ఇప్పటి పూర్తి చేశారు. ముఖ్యంగా కూటమి పార్టీల నేతల పోటీ పడి మరీ.. తెనాలి–రేపల్లె, తెనాలి–చిలుమూరు ప్రధాన రహదారుల వెంబడి 10 నుంచి 12 ఎకరాల పంట పొలాలను లీజుకు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment