పెన్షనర్ల సమస్యలపరిష్కారానికి కృషి
బాపట్ల: పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అకౌంట్స్ అధికారి డీఎన్ మోహనరావు పేర్కొన్నారు. బాపట్ల శాఖ అధ్యక్షుడు వై.వి.నరసింహారావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బాపట్ల తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డేను స్థానిక ఎన్జీవో హోమ్‌లో బుధవారం నిర్వహించారు. డీఎస్ నఖారా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మోహన్‌రావు మాట్లాడుతూ ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించి పుట్టిన తేదీ, పేరులో సవరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, ఉత్తర్వులు త్వరలో వస్తాయని తెలిపారు. సంఘం రాష్ట్ర ట్రెజరర్ పి.నాగరాజు మాట్లాడుతూ బాపట్ల జిల్లా అయినప్పటికీ సంఘానికి భవనం లేదని, స్థానిక ఎన్జీఓ హోమ్‌లో కనీసం 50 గజాల స్థలం కేటాయిస్తే భవనాన్ని నిర్మించుకుంటామన్నారు. నూతన సంవత్సర పెన్షనర్స్ సంఘం డైరీని ఆవిష్కరించారు. సీనియర్ పెన్షనర్లు టి.వెంకటరంగం, ఎల్.మాణిక్యరావ్, విశ్వేశ్వరరావు, శివ బ్రహ్మం, టి.వల్లయ్య, మహదేవ్, కృష్ణ ప్రసాద్, వీరభద్రయ్య, కె.శైలజను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్‌ఎస్‌ఎన్‌పీ శాస్త్రి, రాష్ట్ర కార్యదర్శులు బి.లవ్‌కుమార్, ఎన్.నారాయణ, జిల్లా ట్రెజరీ ఆఫీసర్ జగన్నాథరావు, ఏటీఓ ఎస్.అనురాధ, సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎన్.అనూరాధ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment