భారీగా మద్యం పట్టివేత
వేటపాలెం: మత్స్యకార గ్రామంలో బెల్టు షాపుల నిర్వాకులపై దాడి చేసి 265 మద్యం, 25 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎం.వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. నిర్వాహకుడు దేశాయిపేట గ్రామం దంతంపేటకు చెందిన బొడ్డు నాగశంకర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి, మద్యం బాటిళ్లు ఏ దుకాణం నుంచి వచ్చాయో విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే మండల పరిధిలోని రెండు మద్యం షాపుల యజమానులు మత్స్యకార గ్రామంలో బెల్టు షాపు నిర్వహణకు వేల పాట నిర్వహించినట్లు సమాచారం. అధికార పార్టీకి సంబంధించిన మద్యం షాపు యజమానికి చెందిన బెల్టు షాపు యథావిధిగా కొనసాగుతుందనే ఆరోపణలున్నాయి. మరో మాజీ ప్రజాప్రతినిధి తాలూకు బెల్టు షాపుపై దాడి చేసి, భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మద్యం షాపు యజమానులు బెల్టు షాపు నిర్వహణలో పోటీ పడుతున్నారు. జిల్లా స్థాయి అధికారులు పూర్తిగా విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
265 మద్యం, 25 బీర్ బాటిళ్లు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment