యువకుడిపై హత్యాయత్నం
తెనాలిరూరల్: తెనాలిలో యువకుడిపై హత్యాయత్నం జరిగింది. వెండి పని చేసుకునే తేలప్రోలు గ్రామానికి చెందిన షేక్ సుభానీపై గురువారం ఉదయం నడిరోడ్డుపై ఈ హత్యాయత్నం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరా.. తేలప్రోలుకు చెందిన షేక్ సుభానీ తన సోదరుడు బాజితో కలిసి ఓ ఫంక్షన్‌కు మిత్రులను పిలిచేందుకు తెనాలి వచ్చాడు. గాంధీచౌక్ నుంచి కొత్తపేట వెళ్లే దారిలో రోడ్డు పక్కన నిలబడి ఉండగా తేలప్రోలుకు చెందిన అరాఫత్, ఇర్ఫాన్‌లు వచ్చి కత్తితో దాడి చేశారు. సుభానీ తీవ్రంగా గాయపడటంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment