రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి
బాపట్ల: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహన చోదకులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి గురువారం ప్రారంభించారు. కలెక్టరు కార్యాలయంలో రహదారి భద్రతకి సంబంధించిన ప్రచార బ్యానర్స్, పోస్టర్స్‌ను ఆయన విడుదల చేశారు. రహదారి భద్రతా మాసోత్సవాలు ఫిబ్రవరి 15 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ప్రమాదాల సంఖ్యను జీరో కు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రహదారి భద్రత అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకుగాను రహదారి భద్రతలో అనుబంధ శాఖలు అయిన రవాణా, పోలీస్, రహదారి ఇంజినీరింగ్, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె.పరంధామరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డీసీహెచ్ ఎస్ శేషుకుమార్, బాపట్ల డిపో మేనేజర్ బి.శ్రీమన్నారాయణ, రోడ్ సేఫ్టీ ఎన్జీఓ రాజా సాల్మన్, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
Comments
Please login to add a commentAdd a comment