ప్రీ ఫ్యాబ్ హౌస్ నిర్మాణాలకు జనాదరణ
భట్టిప్రోలు: మారుతున్న కాలానికి అనుగుణంగా ఇటుకలు, ఇసుక, సిమెంట్, ఫిల్లర్లు అవసరం లేకుండా ప్రీ ఫ్యాబ్ హౌసెస్‌ను నిర్మించుకునేందుకు గృహ నిర్మాణదారులు మొగ్గు చూపుతున్నారు. దేశ, విదేశాలలో విశేషాదరణ చూరగొంటున్న ఈ నిర్మాణాలు తెలంగాణ నుంచి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో విస్తరణ చెందుతుంది. సిమెంట్, ఫైబర్ ప్యానల్స్, ఐరన్‌తో వీటిని నిర్మిస్తున్నారు. భట్టిప్రోలులోని అతి ప్రాచీనమైన బుద్ధుని అస్థికలపై 2 వేల సంవత్సరాల కిందిట నిర్మించిన బౌద్ధ స్థూపంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ముఖ ద్వారం వద్ద ఆర్వో ప్లాంట్, సెక్యూరిటి సిబ్బంది ఉండేందుకు ఒక కంటెయినర్‌లో రెండు క్యాబిన్లను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన పోలోజు వసంతాచారి ఆధ్వర్యంలో ఈ బృందం సభ్యులు అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూ.3 లక్షల వ్యయంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. ఇటీవల నాగార్జునసాగర్‌లో రూ.4.12 లక్షల వ్యయంతో నిర్మించిన కంటెయినర్ పనులు ఆర్కిలాజికల్ సిబ్బందికి నచ్చడంతో భట్టిప్రోలులోని పనులను కూడా అప్పగించారు. ప్రస్తుతం బౌద్ధ స్థూపంలో జరుగుతున్న పనులను ప్రతి ఒక్కరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ప్రయోజనాలు
● 50–60 ఏళ్లు మన్నికగా ఉంటుంది. ఫిల్లర్స్ లేకపోయినా డాబాపై రూమ్స్ కట్టుకోవచ్చు.
● ఇంటి భారం మొత్తం స్ట్రక్చర్‌పై పడటం వల్ల ఈ ప్రీ ఫ్యాబ్ హౌస్‌కి పునాదులు కూడా అవసరం లేదు. పాత గృహాలు వర్షం కురిసినప్పుడు కారుతున్నా కూడా పైన గదులు నిర్మించుకోవచ్చు.
● నీరు పడినా, అగ్నిప్రమాదం సంభవించినా ఏమీ కాదు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతౌల్యత, వేడి రహితంగా, తగిన స్థలంలో నిర్మాణం, ధ్వని రహిత, ధృఢత్వం కలిగి ఉండటమే కాక చెదలు పట్టవు.
● క్రేన్ ద్వారా స్క్రూలు ఊడదీసుకుని మరోక ప్రాంతానికి కంటెయినర్‌ను తరలించవచ్చు. భూకంపాలు సంభవించినా ప్రాణ నష్టం వాటిల్లదు.
● ఎత్తు తక్కువైనా పెంచుకోవచ్చు.
పట్టణాల నుంచి పల్లెలకు విస్తరణ భట్టిప్రోలు బౌద్ధ స్థూపంలో ప్రీ ఫ్యాబ్ హౌస్ కంటెయినర్ పనులు తక్కువ ఖర్చుతో త్వరితగతిన నిర్మాణం ఉమ్మడి గుంటూరు జిల్లాలో వీటి నిర్మాణాలపై ఆసక్తి
భూకంపాలు సంభవించినా ఇబ్బంది లేదు..
భూకంపాలు సంభవించినా ప్రాణ నష్టం వాటిల్లదు. తక్కువ ఖర్చుతో త్వరితగతిన నిర్మాణం చేపట్టవచ్చు. సేమ్ బ్రిక్ వాల్ కట్టుకుంటున్నట్లు ఉంటుంది.
–పోలోజు వసంతాచారి,
హుజూర్‌నగర్, తెలంగాణ రాష్ట్రం
Comments
Please login to add a commentAdd a comment