డ్రైవింగ్ శిక్షణ తరగతులు ప్రారంభం
పట్నంబజారు: డ్రైవర్లు విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని ఏపీఎస్ ఆర్‌టీసీ రీజియన్ మేనేజర్ ఎం.రవికాంత్ చెప్పారు. గుంటూరు జిల్లా పరిధిలోని హెవీమోటారు వెహికల్ డ్రైవింగ్ స్కూల్ 18 బ్యాచ్‌కు శిక్షణ తరగతులు గురువారం బస్టాండ్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ.. హెవీ డ్రైవింగ్ స్కూల్‌లో సీనియర్ డ్రైవర్ల చేత నాణ్యమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిపో –2 మేనేజర్, డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపల్ షేక్ అబ్దుల్‌సలాం పాల్గొన్నారు.
కంప్యూటర్, ట్యాలీ కోర్సులో ఉచిత శిక్షణ
గుంటూరుఎడ్యుకేషన్: ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు బెంగళూరులో కంప్యూటర్, ట్యాలీ నైపుణ్యంపై ఉచిత శిక్షణతోపాటు నూరు శాతం ఉద్యోగావకాశా లు కల్పిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధి హరిప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బెంగుళూరులో 35 రోజుల పాటు ఉచిత భోజన, వసతితో కూడిన శిక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 90004 87423 ఫోను నంబర్లో సంప్రదించాలని సూచించారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
తెనాలిరూరల్: తెనాలిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పట్టణంలోని ముత్తెంశెట్టిపాలెం నుంచి ఇస్లాంపేట వైపు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఆమె మృతి చెంది ఉండటాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. తమిళనాడుకి చెందిన మణి అనే వ్యక్తితో 50 ఏళ్ల ఈ మహిళ కొంత కాలంగా కలిసి ఉంటోందని చెబుతున్నారు. మణి కర్రీ పాయింట్‌లో పని చేస్తుండగా, మహిళ బిక్షాటన చేసేదన్నారు. గత రాత్రి రోడ్డు పక్కన నిద్రించిన మహిళ తెల్లవారే సరికి మృతి చెంది ఉండటం చర్చనీయాంశమైంది. రాత్రి ఇద్దరూ కలిసి మద్యం తాగి గొడవపడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళ ప్రైవేటు శరీర భాగాల నుంచి తీవ్రంగా రక్తస్రావం అయినట్లుగా తెలుస్తోంది. మణిని పోలీసు లు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళ మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ బి.జనార్దనరావు, వన్ టౌన్ సీఐ వి.మల్లికార్జునరావులు పరిశీలించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment