పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా ముందుకు..
బాపట్ల:పరిసరాలు–పరిశుభ్రతే లక్ష్యంగా ముందుకు పోద్దామని కలెక్టర్ జె.వెంకట మురళి పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా శనివారం రాజీవ్‌గాంధీ కాలనీలో ఏర్పాటుచేసిన ర్యాలీని కలెక్టర్ జె వెంకట మురళి, ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్‌బాబు కలసి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోనే పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివాస్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బాపట్ల ఆర్డీవో గ్లోరియా, బీసీ సంక్షేమ శాఖ అధికారి శివలీల, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్‌రెడ్డి, తహసీల్దార్ సలీమా, రెడ్‌క్రాస్ సభ్యు లు నారాయణ భట్టు తదితరులు పాల్గొన్నారు.
మౌలికసదుపాయాలు కల్పించాలి
గృహ నిర్మాణ శాఖ ద్వారా ఏర్పాటైన కొత్త లే అవుట్‌లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ జె వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ, అనుబంధ శాఖల అధికారులతో శనివారం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 287 లే అవుట్‌లు ఉండగా అత్యవసరంగా 195 సీసీ రోడ్లు నిర్మించాలని గుర్తించినట్లు చెప్పారు. 185 సీసీ డ్రెయిన్‌లు నిర్మించాలన్నారు. 95 లే అవుట్‌లకు సురక్షిత నీరు సరఫరా చేయాల్సి ఉందన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్‌గౌడ్, గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వర్లు, అనుబంధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
Comments
Please login to add a commentAdd a comment