రేపల్లెరూరల్: ఖైదీలు సత్ప్రవర్తనతో కూడిన జీవితాన్ని అవలంభించాలని సీనియర్ సివిల్ జడ్జి టీ.వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని సబ్‌జైలులో శనివారం రిమాండ్ ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించి మాట్లాడారు. క్షణికావేశంలో చేసే తప్పిదాలతో తమతోపాటు తమ కుటుంబ సభ్యులు కూడా జీవితాలను కోల్పోవాల్సిన పరిస్థితులు ఉంటాయన్నారు. పగ, ప్రతీకారాలను వీడి శాంతియుతంగా జీవించాలని సూచించారు. చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. అనంతరం జైలులో ఖైదీలకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. వివిధ రకాల చట్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రూపశ్రీ, సబ్‌జైల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు
Comments
Please login to add a commentAdd a comment