తెనాలి అర్బన్: తెనాలి–గుంటూరు నాన్‌స్టాప్ బస్సు సర్వీసులను పునఃప్రారంభించినట్లు ఆర్టీసీ తెనాలి డిపో మేనేజర్ ఎ.రాజశేఖర్ పేర్కొన్నారు. బస్సు సర్వీసులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు సర్వీసు ఉంటుందన్నారు. ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులంతా ఈ సేవలను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ప్రసాద్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment