18 తరువాత కేంద్రం పరిశీలన...
ప్రజలు ముసాయిదాపై మైగవ్.ఇన్ వెబ్‌సైట్‌లో ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు పంపవచ్చని కేంద్రం పేర్కొంది. ఫిబ్రవరి 18వ తేదీలోగా వచ్చిన వాటిని పరిశీలించనుంది. వాటి ఆధారంగా ముసాయిదాలో మార్పుచేర్పులు చేసి చట్టాన్ని తీసుకురానుంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఈ మేరకు పేర్కొంది. సోషల్ మీడియాలను నిర్వహించే సంస్థలు చిన్నారుల వ్యక్తిగత డేటాను వాడుకోవాలన్నా, భద్రపరుచుకోవాలన్నా తల్లిదండ్రుల సమ్మతి పొందాలి. ఈ ముసాయిదాలో వినియోగదారునికి అనుకూలంగా పలు కీలక అంశాలు ఉన్నాయి. డేటా సంరక్షణపై వినియోగదారులకు పూర్తి నియంత్రణ ఉంటుంది. సేకరించిన డేటాను డిలీట్ చేయాలని కోరే హక్కు వినియోగదారులకు రానుంది. డేటా ఉల్లంఘనకు పాల్పడితే సదరు సంస్థలపై రూ. 250 కోట్ల వరకు జరిమానా విధించే ప్రతిపాదనను ఈ ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది.
పట్నంబజారు : సోషల్ మీడియాలో ఇకపై మైనర్లు (18 ఏళ్లలోపు పిల్లలు) ఇష్టం వచ్చినట్లు ఖాతాలు తెరిచేందుకు వీలుండదు. తల్లిదండ్రుల అనుమతి (వెరిఫయబుల్ కన్సెంట్) ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. కేంద్ర సమాచారశాఖ విడుదల చేసిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్ట ముసాయిదాలో ఈ మేరకు నిబంధన చేర్చారు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే తల్లిదండ్రులు, గార్డియన్ అనుమతి ఇచ్చిన తర్వాతే మైనర్లు సోషల్ మీడియా ఖాతాలు, ఈ– కామర్స్, గేమింగ్ యాప్‌లు వాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో కొందరు తమ పుట్టిన తేదీ, వయస్సును తప్పుగా నమోదు చేసి సోషల్ మీడియా ఖాతాలు తెరుస్తున్నారు. తద్వారా అనేక పరిణాయాలు, దుష్ప్రభావాలు వారిపై పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇకపై ఇది కుదరదు. పిల్లలకు తల్లిదండ్రులుగా సమ్మతి తెలిపే వారు కూడా తప్పకుండా పెద్దవాళ్లే అని నిర్ధారించాల్సి ఉంటుందని ముసాయిదాలో పేర్కొన్నారు. దివ్యాంగులకు సైతం వారి చట్టబద్ధమైన గార్డియన్ ద్వారా సమ్మతి ఉండాల్సిందే. కొత్త నిబంధనలు మెటా, గూగుల్, యాపిల్, అమెజాన్, ఫ్లిప్‌కార్డ్ వంటి టాప్ సోషల్ మీడియా, ఈ కామర్స్ కంపెనీలకు ఇబ్బంది కలిగించే అవకాశాలు లేకపోలేదు. ఈ ముసాయిదాపై అభిప్రాయాలు తెలిపేందుకు ఫిబ్రవరి 18 వరకు కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. సదరు కంపెనీలు ఈ నిబంధనలు వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి.
దూరంగా ఉంచేందుకు...
ప్రస్తుత సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ వాడకం ఒక భాగమైంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రయాణాలు, లావాదేవీలు, షాపింగ్‌లో పిల్లల నుంచి పెద్దల వరకు సెల్‌ఫోన్ వాడుతూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో చిన్నారులు గంటలకొద్దీ సోషల్ మీడియాలో గడుపుతున్నారని, దీని వల్ల వారిపై విపరీతమైన ప్రభావం పడుతోందని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతే కాకుండా వారి డేటా ఉల్లంఘనలపైనా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చిన్నారులను ఇంటర్నెట్‌కు, అందులోనూ ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు ఇటీవల కొన్ని దేశాలు చర్యలు తీసుకున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలకు సన్నద్ధం అయ్యింది. ఈ చర్యల్లో భాగంగా డిజిటల్ పర్శనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ –2025కు సంబంధించిన ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే ఇక మైనర్లకు సోషల్ మీడియా ఖాతాలు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన డీపీడీపీ ముసాయిదాలో నిబంధన అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఫిబ్రవరి 18 వరకు గడువు
Comments
Please login to add a commentAdd a comment