బాపట్ల: రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సందర్భంగా ఉత్తమ సేవలు అందించినందుకు బాపట్ల జిల్లాలో పలువురు అధికారులను ఎన్నికల కమిషన్ ఎంపిక చేసింది. పోలీసు ఐటీ విభాగం నుంచి ఎస్సై షేక్.నాయబ్‌రసూల్, వివిధ విభాగాలకు చెందిన ఎం.శిరీష, సుబ్బయ్య, సునీల్ ఎంపికయ్యారు. గురువారం రాత్రి చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ అండ్ ఈవో సెక్రటరీ టు గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు వెలుపడ్డాయి. రాష్ట్రస్థాయిలో వివిధ హోదాలో ఉన్న 92 మందిని ఎంపిక చేయగా వీరిలో బాపట్ల నుంచి పలువురు అధికారులు ఉన్నారు. ఈనెల 25న 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ సంబరాల్లో భాగంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా వీరికి అవార్డులు అందజేయనున్నారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ అధికారులుగా ఎంపికైన రసూల్, శిరీష, సుబ్బయ్య, సునీల్‌లను పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment