వ్మూహాత్మకంగా గంజాయి ముఠా ఆటకట్టు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి గంజాయి ముఠా ఆట కట్టించారు. ఆరుగురిని అరెస్టు చేశారు. నార్త్‌జోన్ డీఎస్పీ మురళీకృష్ణ గురువారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐ కళ్యాణ్‌రాజుతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఇటీవల గంజాయి కొనుగోలు చేసిన బండిరెడ్డి నందు అలియాస్ బాలును పోలీసులు పట్టుకుని వదిలివేశారు. దీనిపై విమర్శలొచ్చినా లెక్కచేయలేదు. వ్యూహాత్మకంగా అతనిపై నిఘా పెట్టారు. మరింత సమాచారం సేకరించారు. అతనిచ్చిన సమాచారం మేరకు తాడేపల్లి కృష్ణాకెనాల్ జంక్షన్ పరిధిలో బాలుతోపాటు షేక్ మహబూబ్ బాషా, ఊట్ల ప్రవీణ్, షేక్ మహబూబ్ జానీ, మేడా ఆనందరావు, షేక్ జానీ గంజాయి కొనుగోలు చేసి తాగుతూ ఉండగా అదుపులోకి తీసుకుని వీరి వద్ద నుంచి కేజీ 200 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. వీరికి గంజాయి సప్లయ్ చేస్తున్న మణికుమార్ పరారయ్యాడు., అతన్ని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే పట్టుబడిన వారిలో గంజాయి కలిగి ఉన్న వారు ఇద్దరు మాత్రమే అని, మిగిలిన వారు గతంలో గంజాయి సేవించి పలు గొడవల్లో ఉన్నవారని, వారిని తాడేపల్లి పోలీసులు ఇంట్లో ఉన్న సమయంలో బలవంతంగా తీసుకువచ్చి కేసు నమోదుచేశారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు వెల్లడించిన నార్త్‌జోన్
డీఎస్పీ మురళీకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment