28 నుంచి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు
రెంటచింతల: ఫిబ్రవరి 2వ తేదీన జరగనున్న కానుకమాత చర్చి 175 తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీ నుంచి జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బలప్రదర్శన పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను గురువారం కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఈ పోటీలు ఉంటాయి. ప్రతి విభాగంలో 9 బహుమతుల చొప్పున 54 మంది విజేతలకు మొత్తం రూ. 16.30 లక్షల నగదు అందచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 28న రెండు పళ్ల విభాగం, 29న నాలుగు పళ్ల విభాగం, 30న ఆరు పళ్ల విభాగం, 31న న్యూ కేటగిరీ, ఫిబ్రవరి 1వ తేదీన జూనియర్స్ విభాగం, 3వ తేదీన సీనియర్స్ విభాగంలో పోటీలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అల్లం ప్రతాప్‌రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, గొంటు సుమంత్ రెడ్డి, తుమ్మా జోజిరెడ్డి, గాదె కిరీటిరెడ్డి, బొడపాటి రామకృష్ణ, ఓరుగంటి ఇన్నారెడ్డి, మూలి రాజారెడ్డి, కొమ్మారెడ్డి జోసఫ్‌రెడ్డి, మొండెద్దు చిన్న శౌర్రెడ్డి, ఏరువ జోజిరెడ్డి, గొంటు రవికిరణ్‌రెడ్డి, వై. అప్పయ్య, షేక్ బుజ్జి, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment