లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): కెమికల్ వేస్ట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధికమొత్తంలో లాభాలు ఆర్జించవచ్చని స్నేహితుడిని నమ్మించి రూ.5.67 కోట్ల మేర దోచేసిన ఘరానా మోసగాడిని అరండల్ పేట పోలీసులు గురువారం అరెస్టుచేశారు. సీఐ వీరాస్వామి కథనం ప్రకారం.. గుంటూరు హిందూ కళాశాలలో టూరు రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన రాజుపాలెంరమేష్, పెదకూరపాడు ప్రాంతానికి చెందిన పమిడిపల్లి అనీల్‌కుమార్ కలిసి చదువుకున్నారు. అనిల్ కుమార్ హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. కొంత కాలం కెమికల్ ఫ్యాక్టరిలో పనిచేశాడు. స్నేహితుల వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుని శానిటైజర్ వ్యాపారం ప్రారంభించాడు. నష్టం రావడంతోపాటు వ్యసనాలకు బానిసయ్యాడు. అప్పుల పాలయ్యాడు. అప్పులు ఎలాగైనా తీర్చాలని మోసానికి పథకం పన్నాడు. స్నేహితుడు రాజుపాలెం రమేష్‌ను కలిసి ఎన్‌ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కెమికల్ రీసైక్లింగ్ , కెమికల్ వేస్టేజ్ పరిశ్రమ నడుపుతోందని, దీనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని మాయమాటలు చెప్పాడు. నమ్మిన రమేషకొంత మొత్తం ఇచ్చాడు. లాభాలు బాగానే ముట్టజెప్పి నమ్మకం కల్పించాడు. దీంతో రమేష్ తన పరిచయస్తులు సుమారు 32 మంది వద్ద నుంచి సుమారు రూ.14,61,44,705 పెట్టుబడిగా పెట్టించాడు. ఆ తర్వాత అనిల్ వారికి చెప్పిన లాభాలు ఇవ్వలేదు. అసలు కోసం అడిగినా తప్పించుకుని తిరిగాడు. దీంతో రమేష్ ఈనెల 15న అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ వీరాస్వామి, వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ పర్యవేక్షన్‌లో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేశారు. అనిల్‌కుమార్ గురువారం గుంటూరు బొంగరాల బీడు వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో వలపన్ని అరెస్టు చేశారు. తనకు డబ్బు ఇచ్చిన వారిలో కొందరికి రూ. అనిల్‌కుమార్‌ను పోలీసులు విచారించగా పెట్టుబడి పెట్టిన వారిలో కొందరికి తిరిగి రూ.8,94,41,200 వరకు చెల్లించానని, రూ.5,67,03,605 కోట్లు చెల్లించాలని వివరించాడు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ వీరాస్వామి, ఎస్సై కృష్ణబాబజీబాబు, హెడ్ కానిస్టేబుల్ శివనాగేశ్వరరావు, అప్పలనాయుడు, రామకృష్ణ, బాలశివశంకర్‌ను జిల్లా అధికారులు అభినందించారు.
పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం స్నేహితుడిని నమ్మించి మోసం చేసిన నిందితుడు అరెస్టు చేసిన అరండల్‌పేట పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment