పశుగణాభివృద్ధికి విశేష కృషి
పర్చూరు(చినగంజాం): గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుతున్న పశు సంపదను అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ అధికారి చేకూరి చంద్రశేఖర్ అన్నారు. గురువారం నాగులపాలెం గ్రామంలో పశుసంతానోత్పత్తి శిబిరాన్ని సర్పంచ్ దాసి సుధారాణి ప్రారంభించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 31వ తేదీ వరకు పశువుల ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లింగ నిర్ధారిత వీర్యం ద్వారా 90 శాతం పశువుల్లో కచ్చితంగా మేలుజాతి పెయ్యి దూడలను పుట్టించవచ్చు అని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ మేలు జాతి పెయ్యి దూడలు ఉత్పత్తి కావడం వలన గ్రామాల్లో పశుసంపద అభివృద్ధి చెందుతున్నారు. ఒట్టిపోయిన పశువులకు కూడా పిండ మార్పిడి పరిజ్ఞానాన్ని ఉపయోగించి మేలు జాతి దూడలను ఉత్పత్తి చేయవచ్చని వివరించారు. ఈ పరిజ్ఞానం ద్వారా 33 దూడలను పుట్టించినట్లు తెలిపారు. ఈ శిబిరంలో 75 గేదెలను 15 ఆవులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి బి.వేణుగోపాల్ తెలిపారు. ప్రత్యేక అధికారి పి.షానీలా, ఏడీ మాధవి, వైద్యాధికారులు డాక్టర్ భాగ్యరాజ్, డాక్టర్ రవి, డాక్టర్ అరుణ, గోపాల మిత్ర, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment