బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Published Fri, Jan 24 2025 2:23 AM | Last Updated on Fri, Jan 24 2025 2:23 AM

బాపట్

బాపట్ల

శుక్రవారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2025

సాగునీటి సమాచారం

తాడేపల్లిరూరల్‌ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద గురువారం 1818 క్యూసెక్కులు, అనుబంధ కాల్వలకు కూడా నీటిని విడుదల చేశారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం గురువారం 557.40 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 9,633 క్యూసెక్కులు విడుదలవుతోంది.

ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం

నరసరావుపేట రూరల్‌: ఇస్సప్పాలెం శ్రీ మహంకాళి ఆలయ పునర్నిర్మాణానికి నాగిరెడ్డి వీరనారాయణరెడ్డి, ఈశ్వరమ్మ దంపతుల కుమారులు రూ. లక్ష విరాళమిచ్చారు.

సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాలో పోలీసింగ్‌ పూర్తిగా గాడి తప్పిందా అంటే ప్రజల నుంచి అవుననే సమాధానాలు వినవస్తున్నాయి. బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా అధికార పార్టీ నేతలు చెప్పినట్లు ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారు. కొందరిపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పెట్టకుండా రోజుల తరబడి స్టేషన్లలో ఉంచి టార్చర్‌ పెడుతున్నారు. మరికొన్ని చోట్ల బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకుండా వారిపైనే రివర్స్‌ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు

జిల్లా విచ్చలవిడి మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. గాంజా, గోవా మద్యం కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతోంది. మరోవైపు కోడిపందేలు, పేకాటతోపాటు ఇతర జూద క్రీడలు పెరిగాయి. వాటిని అదుపు చేయాల్సిన పోలీసులు కొందరు నిర్వాహకులకు సహకరిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. సామాన్యులు కోడితో కనిపించినా సహించని పోలీసులు ఎమ్మెల్యే, మంత్రులు బహిరంగంగా కోడిపందేలు ఆడినా స్పందించకపోవడం చర్చనీయాంశగా మారింది.

ప్రతిపక్షాలపై ఖాకీల కౌర్యం

కొందరు పోలీసులు పచ్చనేతల కనుసన్నల్లో పని చేస్తూ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను, సామాన్యులను వేధిస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తూ అరాచకం సృష్టిస్తున్నారు. బుధవారం రాత్రి బాపట్లలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలి య ని దుండగులు చింపివేశారు. గతంలోనూ ఆయన ఇంటివద్ద రెచ్చగొట్టేలా డీజేలతో రక్తచరిత్ర పాటలు పెట్టి గొడవకు దిగారు. ఈ సంఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.

జిల్లాలో హత్యల పరంపర

● ఏడు నెలల కాలంలోనే జిల్లాలో పెద్ద ఎత్తున హత్యలు చోటుచేసుకున్నాయి. వేటపాలెం మండలం పాపాయిపాలెంకు చెందిన పులి శ్రీనివాసరావు చీరాల ప్రాంతంలో హత్యకు గురయ్యారు. కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌ సీపీ నేతలు గొడవకు దిగడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.

● చీరాల రూరల్‌ మండలం ఈపూరుపాలెం ఈసుఫ్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ ఆరీఫ్‌ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు.

● చీరాల రూరల్‌ మండలం ఈపూరుపాలెంలోని సీతారామపురానికి చెందిన పి.సుచిరిత గతేడాది జూన్‌ 21 తేదీ ఉదయం 5.30 గంటల సమయంలో గంజాయి బ్యాచ్‌ గ్యాంగ్‌రేప్‌ చేసి హత్య చేయడం రాష్ట్రంలో సంచలనం రేపింది.

● చీరాల పట్టణానికి చెందిన కంచర్ల సంతోష్‌ (36)ను ఒక పండ్ల వ్యాపారి పండ్లు కోసే కత్తితో విచక్షణ లేకుండా పొడిచి చంపాడు.

● ఈపురుపాలెంలో రిటైర్డు ఉపాధ్యాయురాలు పిల్లి లలితమ్మ (75) ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో స్థానిక కేబుల్‌ టీవీ నిర్వాహకుడు కత్తితో దాడిచేసి హతమార్చారు.

● చీరాలలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కిడ్నాప్‌ చేసి హత్య చేశారు.

● రేపల్లె నియోజకవర్గం నగరం మండలం దాసరిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త నున్నా భూషయ్య(47)పై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడిచేసి హత్య చేశారు.

బుధవారం రాత్రి వైఎస్సార్‌ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి ఇంటి వద్ద ఉన్న ఫ్లెక్సీలు

చింపి వేసిన దుండగులు

I

న్యూస్‌రీల్‌

ప్రశ్నిస్తే రౌడీషీట్‌

ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో ప్రశ్నించినందుకు పోలీసులు బాపట్లకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు జోగి రాజాపై కేసులు పెట్టి రౌడీషీట్‌ తెరిశారు. అద్దంకి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ప్రభాకరరెడ్డి వర్గానికి చెందిన పలువురిపై అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి సకాలంలో కోర్టులో హాజరు పెట్టకుండా వేధించారు. బాధితుల కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ తుషార్‌ డూడీని కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.

ఏడు నెలల పాలనలో ఎనిమిది హత్యలు

జోరుగా కోడిపందేలు, పేకాట కేంద్రాలు

విచ్చవిడిగా నాటుసారా విక్రయం

వేలసంఖ్యలో బెల్టు దుకాణాలు

యథేచ్చగా గోవా మద్యం,

గంజాయి సరఫరా

వైఎస్సార్‌ సీపీ వారిపై అక్రమ కేసులు

స్టేషన్‌లలో నిర్బంధించి వేధింపులు

జిల్లా పోలీసు బాస్‌ తీరుపై విమర్శలు

No comments yet. Be the first to comment!
Add a comment
బాపట్ల1
1/6

బాపట్ల

బాపట్ల2
2/6

బాపట్ల

బాపట్ల3
3/6

బాపట్ల

బాపట్ల4
4/6

బాపట్ల

బాపట్ల5
5/6

బాపట్ల

బాపట్ల6
6/6

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement